ఇస్రో మరో ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోదన సంస్థ ఇస్రో మరో రాకెట్ ను ప్రయోగించింది. ఈరోజు ఉదయం 8.30 గంటల సమయంలో నింగిలోకి దూసుకెళ్లింది

Update: 2023-03-26 04:07 GMT

భారత అంతరిక్ష పరిశోదన సంస్థ ఇస్రో మరో రాకెట్ ను ప్రయోగించింది. ఈరోజు ఉదయం 8.30 గంటల సమయంలో నింగిలోకి దూసుకెళ్లింది. వన్ వెబ్ కు చెందిన 36 ఉప గ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. ఎల్‌వీఎం 3 వాహన నౌక ద్వారా ఈ ఉపగ్రహాలు నింగిలోకి చేరుకున్నాయి. వన్ వెబ్ ఇండియా -2 పేరుతో ఈ ర్యాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ థావన్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది.

వాణిజ్య ప్రయోగం...
మొత్తం 5,796 కిలోల బరువున్న 36 ఉప గ్రహాలను ఎల్‌వీఎం 3 వాహన నౌక తీసుకెళ్లింది. వన్ వెబ్ తో మొత్తం 72 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లేందుకు ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో 36 విగ్రహాలను ఇప్పటికే మోసుకెళ్లింది. తాజాగా ఈరోజు మరో 36 ఉప గ్రహాలను మోసకెళ్లింది. ఇస్రో రెండో వాణిజ్య ప్రయోగం విజయవంతమయింది.


Tags:    

Similar News