నేడు, రేపు రాజ్ నాధ్ సింగ్ కచ్ లో పర్యటన
భారత రక్షణ శాఖ మంత్రి నేడు, రేపు కచ్ లో పర్యటించనున్నారు
భారత రక్షణ శాఖ మంత్రి నేడు, రేపు కచ్ లో పర్యటించనున్నారు. రాజ్ నాథ్ సింగ్ నేడు భుజ్ వైమానికదళ స్టేషన్ కు వెళ్లనున్నారు. నలియా వైమానాిక స్థావరంలో జరిగే సమావేశానికి రాజ్ నాథ్ సింగ్ హాజరు కానున్నారు. పాక్ - భారత్ ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్ నాథ్ కచ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతర్జాతీయ సరిహద్దు భద్రతను...
ఈరోజు అంతర్జాతీయ సరిహద్దు భద్రతను రాజ్ నాధ్ సింగ్ సమీక్షించనున్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పాక్ సైన్యం వక్రబుద్ధిని మార్చుకోకపోవడంతో పాటు ఉగ్రవాదులు చొరబడే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఆపరేషన్ సిందూర్ పై ఆగ్రహంగా ఉన్న ఉగ్రవాదులు దేశంలోకి చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని రాజ్ నాధ్ సింగ్ భద్రతాదళాలకు చెప్పనున్నారు.