ఈరోజు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటంతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. వర్చువల్‍గా ఈ సమావేశంలో పాల్గొనాలని ఇండి కూటమిలోని అన్ని పార్టీలకు ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సమాచారం అందించారు.
వర్షాకాల సమావేశంలో...
వర్షాకాల సమావేశంలో పహాల్గామ్ లో ఉగ్రవాదుల దాడి, ఆపరేషన్ సింధూర్, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం తో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలపై చర్చకు పట్టుపట్టే అవకాశముంది. దీంతో పాటు బీహార్ లో ఓటర్ల సవరణపై కూడా వాయిదా తీర్మానం ఇవ్వాలని భావిస్తుంది. అయితే ఇండియా కూటమి సమావేశానికి హాజరుకాబోమని ఆమ్ ఆద్మీపార్టీ స్పష్టం చేసింది.