భారత్ ను చుట్టేస్తున్న కరోనా.. ఈ ఒక్కరోజే

భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 2,71,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

Update: 2022-01-16 04:30 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 2,71,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 314 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,60,42, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం దేశంలో 115,50,377 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,05,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,85,149 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,56,94,66,674 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 7,743 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ రేటు 16,28 శాతంగా ఉంది.


Tags:    

Similar News