ఖుష్బూపై వివాదాస్పద కామెంట్స్.. కనిమొళి క్షమాపణ

తమిళనాడులో బీజేపీ నేత ఖుష్బూ పై డీఎంకే నేత సాదిక్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. కనిమొళి క్షమాపణ చెప్పారు

Update: 2022-10-28 07:07 GMT

తమిళనాడులో బీజేపీ నేత ఖుష్బూ పై డీఎంకే నేత సాదిక్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. కుష్బు, నమిత, గాయత్రి, గౌతమి పెద్ద ఐటమ్స్ అంటూ సాదిక్ ఒక కార్కక్రమంలో వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. డీఎంకే నేతలకు మహిళల పట్ల గౌరవం లేదంటూ వారు విరుచుకుపడుతున్నారు. సాదిక్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో డీఎంకే ఇబ్బందుల్లో పడింది.

కనిమొళి స్పందన...
ఇదేనా డీఎంకే మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు. ఖష్బూ అభిమానులు సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు. సాదిక్ వ్యాఖ్యలపై డీఎంకే నాయకురాలు కనిమొళి స్పందించారు. ఆయన వార్తను తప్పు పట్టారు. కనిమొళి బహిరంగ క్షమాపణలు చెప్పారు. సాదిక్ చేసిన వ్యాఖ్యలకు, డీఎంకేకు సంబంధం లేదని ఆమె తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలను స్టాలిన్ కూడా సమర్థించరని కనిమొళి పేర్కొన్నారు. సాదిక్ పై డీఎంకే చర్యలు తీసుకునే అవకాశముంది.


Tags:    

Similar News