మరో వారంరోజులే గడువు.. ఎస్ఎంఎస్ తో ఆధార్-పాన్ ను లింక్ చేసుకోండిలా

ఈ ఫైలింగ్ పోర్టల్‌లోని ‘లింక్ ఆధార్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత స్క్రీన్‌పై కనిపించిన..

Update: 2023-03-25 07:42 GMT

aadhar pan link status

పాన్ - ఆధార్ అనుసంధానానికి మరో వారంరోజులే గడువు. ఈ నెలాఖరులోగా ఈ రెండు డాక్యుమెంట్ కార్డులను అనుసంధానం చేసుకోకపోతే.. కేంద్రం అనుసంధానం కాని పాన్ కార్డులను నిరుపయోగంగా మార్చే ప్రమాదం ఉంది. మీరు ఇప్పటికీ ఆధార్ - పాన్ కార్డులను లింక్ చేసుకోకపోతే వెంటనే లింక్ చేసుకోండి. ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఆధార్ తో పాన్ కార్డును లింక్ చేసుకోవచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

ఎస్ఎంఎస్ ద్వారా ఇలా లింక్ చేయవచ్చు..
మీ రిజస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 56161 లేదా 567678 నెంబర్‌కు ''UIDPAN<12 అంకెల ఆధార్ నెంబర్><పది అంకెల పాన్ నెంబర్>’’ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.
అలాగే ఇన్ కం ట్యాక్స్ వెబ్ సైట్ ద్వారా కూడా ఆధార్ - పాన్ ను లింక్ చేసుకోవచ్చు. https://www.incometax.gov.in/iec/foportal/ ద్వారా కూడా పాన్, ఆధార్‌ లను లింక్ చేయవచ్చు. వెబ్‌ సైట్‌లోని ఈ-ఫైలింగ్ పోర్ట్‌లో ఇందుకు సంబంధించిన సదుపాయం ఉంది. ఈ ఫైలింగ్ పోర్టల్‌లోని ‘లింక్ ఆధార్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత స్క్రీన్‌పై కనిపించిన పేజ్‌లో ఆధార్, పాన్ నెంబర్‌లు, ఇతర వివరాలను చేర్చి ఎంటర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే రెండు డాక్యుమెంట్లు అనుసంధానమవుతాయి.
ఆధార్ తో మీ పాన్ కార్డ్ లింక్ అయిందో లేదో ఇలా చేసుకోండి. www.incometax.gov.in/iec/foportal/ వెబ్‌సైట్‌లో ఈ ఫైలింగ్ పేజ్‌లో ‘క్విక్ లింక్స్’ విభాగంలోని ‘లింక్ ఆధార్’ స్టేటస్ అన్న లింక్‌పై క్లిక్ చేయాలి. స్క్రీన్ పై ఆధార్ - పాన్ నంబర్లను ఎంటర్ చేసి ‘వ్యూ లింక్ ఆధార్ స్టేటస్’ ఆప్షన్ పై క్లిక్ చేస్తే.. మీ ఆధార్ - పాన్ లింక్ అయిందీ లేనిదీ చెబుతుంది.



Tags:    

Similar News