గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఓపీఎస్ ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది

Update: 2023-01-14 02:00 GMT

హిమాచల్ ప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఓపీఎస్ ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటయిన కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. పాత పెన్షన్ ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదటి మంత్రి వర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

అందరికీ ఓపీఎస్...
ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ నేతృత్వంలోని మంత్రివర్గం మొదటి సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయంతో 1.36 లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఉద్యోగులకు సామాజిక భద్రత, ఆత్మగౌరవం కోసం ఓపీఎస్ ను పునరుద్ధరించామని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. 2004 జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారు కొత్త పెన్షన్ పాలసీలోకి వస్తారని, ఈ ఏడాది ఓపీఎస్ అమలుకు ఎనిమిది నుంచి తొమ్మది వందల కోట్లు అవసరమవుతాయని, డీజిల్ పై మూడు రూపాయలు వ్యాట్ పెంచడం ద్వారా వీటిని సమకూర్చుకుంటామని ఆయన తెలిపారు.


Tags:    

Similar News