పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకుంటున్న మహిళలకు గుడ్‌న్యూస్
భార్య పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవడానికి భర్త సంతకం లేదా అనుమతి అవసరం లేదని మద్రాస్ హైకోర్టు తీర్పును ఇచ్చింది.
భార్య పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవడానికి భర్త సంతకం లేదా అనుమతి అవసరం లేదని మద్రాస్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ ఈ తీర్పును వెలువరించారు. పెళ్లి అయిన మహిళలను భర్తకు చెందిన వస్తువుల్లా చూడకూడదని కోర్టు పేర్కొంది. రేవతి అనే మహిళ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు నాలుగు వారాల్లో పాస్‌పోర్ట్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
2023లో వివాహం చేసుకున్న రేవతికి తన భర్తతో మనస్పర్థలు వచ్చాయి. ఆమె విడాకుల కోసం కోర్టులో కేసు దాఖలు చేసుకున్నారు. ఈ కేసు కొనసాగుతుండగానే ఆమె పాస్‌పోర్ట్ కోసం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఆమె భర్త సంతకం కావాలని కోరడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.