యూపీఐ వినియోగదారులకు గుడ్ న్యూస్
ఫోన్ పే, గూగుల్ పే, ఇతర యాప్ ల ద్వారా యూపీఐ సేవలను వినియోగించే వారికి గుడ్ న్యూస్ అందింది
UPI
ఫోన్ పే, గూగుల్ పే, ఇతర యాప్ ల ద్వారా యూపీఐ సేవలను వినియోగించే వారికి గుడ్ న్యూస్ అందింది. జూన్ 16 నుంచి మరింత వేగంగా యూపీఐ సేవలు ఉంటాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్పటి వరకూ ఎవరికైనా పేమెంట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది. దానివల్ల యూజర్లు ఇబ్బంది పడుతుంటారు.
జూన్ 16వ తేదీ నుంచి...
ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెక్ పెట్టినట్లు తెలిపింది. ఇకపై ప్రాసెసింగ్ సమయాన్ని దాదాపు 50 శాతం మేర తగ్గించనున్నట్లు పేర్కొంది. జూన్ 16వ తేదీ నుంచి సవరించిన సమయం అమల్లోకి రానుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఈ మేరకు వివిధ రకాల యూపీఐ లావాదేవీల గడువును సవరిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఉత్తర్వులను విడుదల చేసింది.