మగువలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర మాత్రం తగ్గింది

Update: 2022-06-26 02:31 GMT

బంగారం ధర కొద్దిరోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తుంది. నిన్న తగ్గిన బంగారం ధర నేడు పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం తదితర కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా తగ్గినప్పుడు తక్కువ మొత్తంలోనూ, పెరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో ఉండటం గమనిస్తూనే ఉన్నాం. బంగారానికి భారత్ లో ఉన్న డిమాండ్ ను బట్టి ధరల్లో హెచ్చు తగ్గుదల ఉంటుందని కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ధరలు ఇలా....
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 51,870 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,550 రూపాయలుగా ఉంది. వెండి ధర మాత్రం కొంత తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 65,700 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News