బంగారం కొనుగోలుదారులకుశుభవార్త

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.110లు తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది

Update: 2023-03-16 04:06 GMT

బంగారం కొనాలంటే ఇప్పడున్న ధరలకు సామాన్యుడికి సాధ్యం కాదు. భారత్ లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం సంస్కృతి, సంప్రదాయాల్లో ఒకటిగా ఉంది. పెళ్లిళ్లు, వేడుకలకు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా మారింది. అయితే తులం బంగారం యాభైవేలు దాటడంతో పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే పరిస్థిితి కనిపించడం లేదు. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నప్పటికీ ధరల పెరుగుదల సామాన్యులను నిరాశకు గురి చేస్తూనే ఉంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు.

పెరిగిన వెండి ధర...
అయితే ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.110లు తగ్గింది. వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి ధరపై రూ.500లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,050 రూపాయలుగా కొనసాగుతుండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,870 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 72,500 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News