ఇలా తగ్గి.. అలా పెరిగిపోయింది !

తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.250 మేర పెరిగింది. ఇదే సమయంలో కిలో వెండిపై రూ.450 మేర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో..

Update: 2023-05-25 03:38 GMT

బులియన్ మార్కెట్లో ప్రతినిత్యం బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. ధర ఎంతైనా పర్లేదు అనుకుని బంగారం కొనేవారు కొందరైతే.. చాలామంది మహిళలు బంగారం ధరలు తగ్గినపుడు కొనాలని వెయిట్ చేస్తుంటారు. అలాంటి వారు మరికొంతకాలం ఆగాల్సిందే. బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నా.. మరుసటి రోజు మళ్లీ పెరుగుతున్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ లో తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయాల్సిన వారు భారీగా ఖర్చు చేయక తప్పదు.

తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.250 మేర పెరిగింది. ఇదే సమయంలో కిలో వెండిపై రూ.450 మేర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం 6 గంటల వరకూ నమోదైన బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250కి పెరుగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,360కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి తదితర ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అలాగే కిలో వెండి ధర రూ.77,500కి తగ్గింది.


Tags:    

Similar News