స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు పదిగ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగింది
బంగారం అంటేనే మహిళలకు మోజు. డబ్బులను దాచుకుని మరీ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. భారతీయ మహిళలు బంగారం అంటే ఎక్కువగా మక్కువ చూపడంతోనే ధరలు పెరుగుతుంటాయి. ప్రధానంగా సీజన్ల ను అనుసరించి ధరలకు రెక్కలు వస్తాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు పదిగ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అయినా ఇది పెద్ద పెరుగుదల కాదని, కొనుగోలు చేయవచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుత ధరలు....
హైదాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,000 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,100 రూపాయలుగా ఉంది. వెండి కిలో ధరల్లో కూడా పెద్దగా మార్పులు లేవు.