షాకింగ్.. పెరిగిన బంగారం ధరలు

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Update: 2022-06-28 01:56 GMT

బంగారం అంటే భారతీయ మహిళలకు పిచ్చి. బంగారం ధరల్లో హెచ్చుతగ్గుదలకు అనేక కారణాలుంటాయని మార్కెట నిపుణులు చెబుతుంటారు. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలలతో పాటు వాటి వడ్డీ రేట్లు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయంగా జరిగే యుద్ధాల ప్రభావం కూడా బంగారం ధరపై పడుతుంది. అయితే భారత్ లో ధరలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. కొనగోలు శక్తి పెరగడంతో బంగారం వైైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

ధరలు ఇలా....
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,980 రూపాలయలు ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉంది. వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో కిలో 66,000 రూపాయలకు చేరకుంది.


Tags:    

Similar News