స్థిరంగా బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరలు ఇలా ఉన్నాయి.

Update: 2022-06-27 02:04 GMT

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? తగ్గుతాయో? చెప్పలేం. ఒకరోజు పెరిగితే.. మరొకరోజు తగ్గుతున్నాయి. అయితే ధరలతో నిమిత్తం లేకుండా బంగారం కొనుగోళ్లు సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లోని ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం తదితర కారణాల వల్ల బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కన్పిస్తున్నాయి. కొద్దిరోజుల్లో ఆషాఢ మాసం వస్తుంది. అప్పడు బంగారం కొనుగోళ్లు తగ్గుతాయి. నిన్న మొన్నటి వరకూ పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లతో జ్యుయలరీ షాపులు కిటకిటలాడాయి. మరో నెల ఆషాఢ మాసం కావడంతో కొనుగోళ్లు పెద్దగా ఉండవన్న అంచనా విన్పిస్తుంది.

ఈరోజు ధరలు...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం 51,870 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,550 రూపాయలుగా ఉంది. వెండి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 65,700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News