గ్రాము కొనాలన్నా గగనమే

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. దీంతో బంగారం కొనాలంటేనే కొనుగోలు దారులు భయపడిపోతున్నారు

Update: 2023-02-08 02:54 GMT

బంగారం ధరలు ఇక ఆగేట్లు లేవు. పరుగులు పెడుతూనే ఉంటాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం పూర్తిగా అందుబాటులో లేకుండా పోయే పరిస్థిితి ఏర్పడింది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకం విలువ కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం పెంచడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు బంగారం భారంగా మారనుంది. పెళ్లిళ్లకు సంప్రదాయంగా వస్తున్న ఆచారాలను కూడా మానుకునే పరిస్థితి నెలకొంది. గ్రాము బంగారం కొనాలనుకున్నా గగనమయ్యే పరిస్థితి ఏర్పడింది. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముంది.

వెండి కూడా...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. దీంతో బంగారం కొనాలంటేనే కొనుగోలు దారులు భయపడిపోతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,750 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,550 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 74,000 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News