పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

తాజాగా భారత్ లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. వెండి కిలో పై రూ.600 ల వరకూ తగ్గింది.

Update: 2022-06-30 02:50 GMT

Hyderabad : బంగారం ధల్లో రోజు వారీ మార్పులు చోటు చేసుకుంటాయి. అనేక కారణాలతో బంగారం ధరల్లో మార్పు కనపడుతుంది. భారత్ లో బంగారానికి ఒక ప్రత్యేకత ఉంది. సంప్రదాయంగా బంగారాన్ని తమ కుటుంబంలో ఒక ప్రధాన వస్తువుగా చూస్తారు. ప్రతి శుభకార్యక్రమంలో బంగారానికి చోటు ఉంటుంది. అందుకే బంగారానికి భారత్ లో డిమాండ్ అధికంగా ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా బంగారం కొనుగోళ్లు జరుగుతుంటాయి. ధరలు పెరిగినా, తగ్గినా బంగారం కొనుగోళ్లు మాత్రం భారత్ లో ఆగవు. అందుకే జ్యుయలరీ షాపులు నిత్యం రద్దీగానే ఉంటాయి.

వెండి ధర తగ్గి...
తాజాగా భారత్ లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. వెండి కిలో పై రూ.600 ల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,000 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,750 రూపాయలుగా ఉంది. కిలో వెండి పై రూ.600 లు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి 65,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News