దిగివస్తున్న బంగారం.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్

10 గ్రాముల బంగారంపై రూ.200 తగ్గగా.. కిలో వెండిపై రూ.400 తగ్గింది. తగ్గిన ధరలతో నేటి ధరలు ఇలా ఉన్నాయి. తెలుగు..

Update: 2023-06-30 03:43 GMT

బంగారం ధరల్లో ప్రతినిత్యం హెచ్చుతగ్గులు సహజం. అందుకు రకరకాల కారణాలుంటాయి. కొద్దిరోజుల క్రితం.. తగ్గేదే లే అంటూ.. పైకి ఎగబాకిన బంగారం రూ.66 వేల మార్క్ ను అందుకుంది. నెలరోజులుగా స్వల్పంగా పెరుగుతూ.. తగ్గుతూ.. అటూ ఇటూ ఊగిసలాడుతూ.. ఇప్పుడు రూ.59 వేలకు తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. బంగారం ధరలకు సీజన్లతో పనిలేదు కానీ.. పెళ్లిళ్ల సీజన్ మొదలైందంటే.. డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా ధరలూ పెరుగుతాయి. అందుకే బంగారం ధర తక్కువగా ఉన్నప్పుడే కొనుక్కోవడం మంచిది. శుక్రవారం ఉదయం 6 గంటల వరకూ ఉన్న ధరల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి.

10 గ్రాముల బంగారంపై రూ.200 తగ్గగా.. కిలో వెండిపై రూ.400 తగ్గింది. తగ్గిన ధరలతో నేటి ధరలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,750గా ఉండగా.. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.53,850గా ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,900 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,000కి తగ్గింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,700, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,850గా ఉంది.
వెండి ధరల విషయానికొస్తే.. ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.71,900కి తగ్గింది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.75,300 ఉండగా.. బెంగళూరులో రూ.71,250గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.75,300గా ఉంది.


Tags:    

Similar News