స్మతి మంధాన తండ్రి ఆరోగ్యం పై కీలక అప్ డేట్
ఇండియన్ వుమెన్ టీం సభ్యురాలు స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యంపై వారి కుటుంబ సభ్యులు తాజాగా అప్ డేట్ ఇచ్చారు
ఇండియన్ వుమెన్ టీం సభ్యురాలు స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యంపై వారి కుటుంబ సభ్యులు తాజాగా అప్ డేట్ ఇచ్చారు. శ్రీనివాస్ ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. స్మతి మందానాతో మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ తో వివాహం నిశ్చయమైంది. అయితే వివాహానికి ముందే ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో స్మతి మందాన వివాహం వాయిదా పడింది.
ఆసుపత్రి నుంచి...
ప్రస్తుతం శ్రీనివాస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. స్మృతి మంధాన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజే పలాశ్ ముచ్చల్ కూడా ఆసుపత్రి పాలయ్యారు. అతడు ఆసిడిటీ, ఇన్ ఫెక్షన్ కు గురయ్యాడని వైద్యులు తెలిపారు. ఇద్దరి ఆరోగ్యం కుదుటపడింది. అయితే స్మతి మంధాన, పలాశ్ ముచ్చల్ వివాహంపై ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు.