Delhi : మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాన్వాయ్ పై దాడి
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ పై దాడి జరిగింది
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ పై దాడి జరిగింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ పై దాడితో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కేజ్రీవాల్ కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలు రాయి విసిరారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అనుచరుల పనే అని ఆప్ నేతలు చెబుతున్నారు.
ఖండించిన బీజేపీ...
ఆప్ నేతల ఆరోపణలను బీజేపీ ఖండించింది. కేజ్రీవాల్ కారు బీజేపీ కార్యకర్తలను ఢీకొట్టిందన్న బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ తెలిపారు. ఈ ఘటనలోబీజేపీ కార్యకర్తలు గాయపడి ఆస్పత్రిలో ఉన్నారని ఆయన తెలిపారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య జరిగిన ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేి దర్యాప్తు చేస్తున్నారు.