పద్మభూషణ్ ను తిరస్కరించిన మాజీ సీఎం
మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య తనకు ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య తనకు ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. పద్మభూషణ్ అవార్డును బుద్దదేవ్ భట్టాచార్యకు ఇస్తూ నిన్న ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు గురించి తనకు పెద్దగా తెలయదని, దీని గురించి తనకు ఎవరూ ఏమీ చెప్పలేదని, ఈ అవార్డు తనకు ఇచ్చినా తిరిగి ఇచ్చేస్తానని బుద్దదేవ్ భట్టాచర్య ఒక ప్రకటనలో ఆయన తెలియజేశారు.
సీపీఎం నేతగా....
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టా చార్య ప్రస్తుతం సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్ కు ముఖ్యమంత్రిగా పనిచేసి విశిష్ట సేవలందించారు. అయితే ఆయన తాను పద్మభూషణ్ ను తిరస్కరిస్తున్నట్లు చెప్పడం విశేషం.