నౌకాదళంలో తొలిసారిగా మహిళా ఫైటర్ పైలట్లు!

భారత నౌకాదళంలో సరికొత్త అధ్యాయం మొదలైంది.

Update: 2025-07-05 10:45 GMT

భారత నౌకాదళంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. నేవీ ఏవియేషన్‌లో ఆస్తా పూనియా దేశంలోనే తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌గా నిలిచారు. భవిష్యత్తులో మిగ్‌-29కె లేదా నౌకాదళ రఫేల్‌ యుద్ధ విమానాలను నడిపే అవకాశం ఉంది. త్వరలోనే ఆమె యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందుతారు. ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌కు చెందిన నేవల్‌ ఎయిర్‌స్టేషన్‌ ‘ఐఎన్‌ఎస్‌ డేగా’లో జరిగిన రెండో ప్రాథమిక ‘హాక్‌ కన్వర్షన్‌ కోర్సు’ ముగింపు వేడుకల్లో ‘వింగ్స్‌ ఆఫ్‌ గోల్డ్’ పురస్కారాలు ప్రదానం చేశారు. భారత నౌకాదళంలో ఇప్పటికే మహిళలు పైలట్లుగా సముద్ర నిఘావిమానాలు, హెలికాప్టర్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. నౌకాదళ యుద్ధ విమానాలు నడపనున్న తొలి మహిళగా ఆస్తా పూనియా చరిత్ర సృష్టించనున్నారు.

Tags:    

Similar News