ముంబయిలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న సిబ్బంది
ముంబయి లోని వెస్ట్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది.
ముంబయి లోని వెస్ట్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. 24 అంతస్తుల నివాస భవనంలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు మున్సిపల్ అధికారులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ఈ అగ్ని ప్రమాదం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో దహిసార్ ఈస్ట్‌లోని శాంతినగర్ న్యూ జనకల్యాణ్ సొసైటీలో ఏడవ అంతస్తులో ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
దట్టమైన పొగతో...
అయితే ఈ ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. భవనం మొత్తం దట్టమైన పొగతో నిండిపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.కనీసం ఏడు ఫైర్ ఇంజన్లు, ఇతర అత్యవసర సిబ్బంది వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణం ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు.