రైతు కొడుకు రాంబాబు MBBS డాక్టర్ కాబోతున్నాడు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లాలోని రాజ్‌పూర్ ఖేడా గ్రామానికి చెందిన 18 ఏళ్ల రాంబాబు డాంగి నీట్ UG లో 23 వేల 748 ఆల్-ఇండియా ర్యాంక్‌ను సాధించాడు.

Update: 2025-06-19 14:00 GMT

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లాలోని రాజ్‌పూర్ ఖేడా గ్రామానికి చెందిన 18 ఏళ్ల రాంబాబు డాంగి నీట్ UG లో 23 వేల 748 ఆల్-ఇండియా ర్యాంక్‌ను సాధించాడు. వారి సమాజంలో వైద్య వృత్తిని చేపట్టిన వారే లేరట. రాంబాబు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుండి వైద్య కళాశాలలో సీటు సాధించే వరకూ చేసిన ప్రయాణం ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతుంది.

700 మంది జనాభా ఉన్న గ్రామంలో డాక్టర్ కాబోతున్న మొదటి వ్యక్తి రాంబాబు. అతని తండ్రి రతన్‌లాల్ ఒక రైతు, తల్లి భగవతి బాయి గృహిణి. రాంబాబు తన తండ్రితో కలిసి పొలాల్లో పనిచేసేవాడు దాంతో పాటే చదువు కూడా కొనసాగించాడు. నీట్ ప్రిపరేషన్ కోసం కోటలోని ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. మొదటి ప్రయత్నంలోనే నీట్ UGలో ర్యాంక్ సాధించాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. 10వ తరగతిలో 86 శాతం మార్కులు సాధించిన తర్వాత వైద్య వృత్తిని ఎంచుకున్నాడు రాంబాబు. ప్రతిరోజూ 25 కిలోమీటర్లు బస్సులో పాఠశాలకు వెళ్లే రాంబాబు, ఇప్పుడు ఆ గ్రామంలో మొదటి MBBS డాక్టర్‌ గా నిలిచాడు.

Tags:    

Similar News