కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ శెట్టర్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో చేరారు

Update: 2023-04-17 05:03 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఖర్గే శెట్టర్ ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీ నేతలు అసంతృప్తికి గురై వరసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందులో జగదీష్ శెట్టర్ ఒకరు.

మాజీ సీఎంగా...
జగదీష్ శెట్టర్ గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే బీజేపీ ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో మనస్తాపానికి గురై పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని జగదీష్ శెట్టర్ అన్నారు.


Tags:    

Similar News