అలర్టయిన కాంగ్రెస్.. క్యాంప్ షురూ

గుజరాత్ లో కాంగ్రెస్ దారుణ ఓటమి పాలయినప్పటీకీ హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ విజయం దిశగా పరుగులు తీస్తుంది.

Update: 2022-12-08 06:25 GMT

గుజరాత్ లో కాంగ్రెస్ దారుణ ఓటమి పాలయినప్పటీకీ హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ విజయం దిశగా పరుగులు తీస్తుంది. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ నలభై స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది. ఇతరులు మూడు స్థానాల్లో మెజారిటీలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

కాపాడుకోవడానికి క్యాంప్...
ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి క్యాంప్ రాజకీయాలను కాంగ్రెస్ తెరతీసిందని చెప్పాలి. ఎమ్మెల్యేలను రాజస్థాన్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ను హుటాహుటిన హిమాచల్ ప్రదేశ్ కు పంపింది. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ప్రత్యేకంగా క్యాంప్ ను ఏర్పాటు చేయాడానికి నిర్ణయించింది, బీజేపీ ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులను దువ్వుతుండటంతో కాంగ్రెస్ అప్రమత్తమయింది.


Tags:    

Similar News