గాంధీ కుటుంబంపై తొలి ఛార్జిషీట్

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల చార్జిషీట్ చేశారు

Update: 2025-04-15 12:42 GMT

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల చార్జిషీట్ చేశారు. మనీలాండరింగ్ కేసులో నమోదు చేసిన ఛార్జిషీట్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నమోదు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జిసీటు దాఖలు చేసింది. ఇప్పటికే ఈడీ అధికారులు నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది.

నేషనల్ హెరాల్డ్ కేసు...
దీంతో గాంధీ కుటుంబంపై తొలి ఛార్జి షీట్ నమోదయినట్లుగా అయింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను జప్తు చేయడమే కాకుండా ఛార్జి షీట్ లో అగ్రనేతల పేర్లు నమోదు చేయడంపై రాజకీయంగా సంచలనం రేపింది. ఈడీ ఛార్జిషీట్ పై ఈనెల 25వతేదన రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరగనున్నాయి. కాంగ్రెస్ నేతలుదీనిని కక్ష సాధింపుచర్యగా చెబుతున్నారు.


Tags:    

Similar News