నేడు ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ఉత్కంఠత ఎందుకంటే?
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నేడు జరగనుంది
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నేడు జరగనుంది. అత్యధిక స్థానాలను గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఉంది. అయితే ఈ ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 104, కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించాయి. ఈరోజు 11 గంటలకు ఎన్నిక జరగనుంది.
పోటా పోటీగా...
తమ పార్టీ మేయర్ అభ్యర్థులుగా షెల్లీ ఒబెరాయ్ తో పాటు ఆశు ఠాకూర్ ను ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టింది. బీజేపీ మాత్రం రేఖా గుప్తాను ప్రకటించింది. డిప్యూటీ మేయర్ పదవికి కమల్ కాంగ్రెస్ పార్టీ ఆలో మహ్మద్, ఇక్బాల్, జలజ్ కుమార్ లను ప్రకటించగా, బీజేపీ కమల్ బగ్రీని బరిలోకి దింపింది. అయితే ప్రొటెం స్పీకర్ గా బీజేపీ కౌన్సిలర్ ను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఎంపిక చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సీనియర్లున్నా ఆయనను ఎలా ప్రకటిస్తారని, బీజేపీ కుట్ర చేయాలనే భావిస్తుందని ఆప్ ఆరోపిస్తుంది. మొత్తం మీద ఢిల్లీ మేయర్ ఎన్నిక చివరి నిమిషం వరకూ టెన్షన్ గానే సాగనుందని తెలిసింది.