నేడు ఢిల్లీ మేయర్ ఎన్నిక
ఢిల్లీ మేయర్ ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఢిల్లీ మేయర్ ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఈరోజు మేయర్ ఎన్నిక జరుగుతుందని ప్రకటించారు. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కుపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఎన్నిక జరుగుతుంది. ఈ సారైనా ఎన్నిక సజావుగా జరుగుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో...
గత ఏడాది డిసెంబరు 7న జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 104, ఆమ్ ఆద్మీ పార్టీకి 134, కాంగ్రెస్ కు తొమ్మిది వార్డులు లభించాయి. అయితే నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటింగ్ హక్కు కల్పిస్తూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమై పలుమార్లు ఎన్నిక వాయిదా పడింది. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేడు జరగనుంది. మేయర్ ఎన్నిక అనంతరం డిప్యూటీ మేయర్, స్థాయి సంఘం సభ్యుల ఎన్నికను కూడా నిర్వహించనున్నారు.