Earth Quake : ధర్మశాలలో భూకంపం
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.9 భూకంప తీవ్రత నమోదయిందని అధికారులు తెలిపారు
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.9 భూకంప తీవ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. నిన్న రాత్రి సంభవించిన భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ లోని...
హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా జిల్లా ధర్మశాల పట్టణానికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు.భూమి లోపల భాగంలో పది కిలోమీటరల అడుగు భాగంలో ఈ భూకంపం సంభవించిందని చెప్పారు. తరచూ ఈ ప్రాంతంలో భూప్రకపంనాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.