నేడు రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు

Update: 2022-07-25 03:04 GMT

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముర్ము చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో ఈ కార్యక్రమాం జరగనుంది. అనంతరం సైనికుకలు ద్రౌపది ముర్మకు 21 గన్ సెల్యూట్ ను సమర్పిస్తారు. సైనిక వందనం స్వీకరించిన అనంతరం ఆమె ప్రసంగం ఉండనుంది. ఈ కార్యక్రమానికి ద్రౌపది ముర్ము కుటుంబం నుంచి కేవలం నలుగురు మాత్రమే హాజరు కానున్నారు. ద్రౌపది ముర్ము సోదరుడు, వదినతో పాటు కూతురు, అల్లుడు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

తొలి ఆదివాసీ....
భారత రాష్ట్రపతిగా తొలిసారి ఆదివాసీ మహిళ ప్రమాణ స్వీకారం చేయనుండటంతో గిరిజన తండాల్లో పండగ వాతావరణం నెలకొంది. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ముర్ము భారీ ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈరోజు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ముఖ్యమంత్రులు, గవర్నర్లు హాజరుకానున్నారు. అనేక మంది అతిధుల సమక్షంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం ద్రౌపది ముర్ము రాజ్‌ఘాట్ లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు.


Tags:    

Similar News