15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

భారత పదిహేనవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు

Update: 2022-07-25 04:52 GMT

భారత పదిహేనవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ము చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన ఈ ప్రమాణస్వీకారానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర గవర్నర్లు హాజరయ్యారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

త్రివిధ దళాలు...
అంతకు ముందు త్రివిధ దళాలు ద్రౌపది ముర్ముకు సెల్యూట్ చేశాయి. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. అంతకు ముందు ద్రౌపది ముర్ము మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించి రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పార్లమెంటు సెంట్రల్ హాలుకు చేరుకున్న ద్రౌపది ముర్ముకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రామ్ నాథ్ కోవింద్ , ఓంబిర్లాలు లు స్వాగతం పలికి ఆమెను పార్లమెంటు సెంట్రల్ హాలులోకి తోడ్కొని వెళ్లారు. ప్రమాణ స్వీకారం అనంతరం ద్రౌపది ముర్ము ప్రసంగించారు.


Tags:    

Similar News