కేరళకు భారత రాష్ట్రపతి ముర్ము.. నాలుగు రోజుల పర్యటన

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలో నాలుగు రోజులు పర్యటించనున్నారు

Update: 2025-10-21 06:52 GMT

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో మద్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి ట్రాఫిక్‌ పరిమితులు అమలులోకి వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ద్రౌపది ముర్ము సాయంత్రం రాష్ట్రానికి చేరుకోనున్నారు. బుధవారం శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత తిరువనంతపురానికి తిరిగి వచ్చి, గురువారం రాజ్‌భవన్‌లో మాజీ రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

భారీ బందోబస్తు...
తర్వాత వర్కలలోని శివగిరి మఠంలో శ్రీనారాయణ గురు మహాసమాధి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం కొట్టాయం జిల్లా పాలలోని సెయింట్‌ థామస్‌ కళాశాల ప్లాటినం జూబిలీ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. అక్టోబర్‌ 24వ తేదీన ఎర్నాకుళంలోని సెయింట్‌ తెరెసా కళాశాల శతాబ్ది వేడుకలకు హాజరై తన కేరళ పర్యటనను ముగిస్తారు.కేరళ పర్యటనకు రాష్ట్రపతి ముర్ము వస్తుండటంతో పెద్దయెత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయనిచెప్పారు. ద్రౌపది ముర్ము మొత్తం నాలుగు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు.


Tags:    

Similar News