కెప్టెన్ విజయకాంత్ కాలి వేళ్లు తొలగింపు

ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. కెప్టెన్ కోలుకోవాలని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌

Update: 2022-06-22 12:57 GMT

DMDK అధ్యక్షుడు విజయకాంత్ కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ కొన్ని రోజులుగా కోలీవుడ్‌ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. మధుమేహంతో బాధపడుతున్న 'కెప్టెన్' కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు డీఎండీకే తెలిపింది.

మధుమేహంతో బాధపడుతున్న ఆయన కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు డీఎండీకే తెలిపింది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని పార్టీ పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని.. ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులు, కార్యకర్తలను కోరింది. కెప్టెన్ విజయకాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టి 2005లో పార్టీని స్థాపించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే పేలవ ప్రదర్శన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పార్టీ ప్రాముఖ్యత క్రమంగా తగ్గింది. ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో గత కొంతకాలంగా అటు రాజకీయాల్లో కానీ, ఇటు సినిమాల్లో కానీ ఆయన చురుకైన పాత్ర పోషించడం లేదు. ఆయన బహిరంగంగా కనిపించడం కూడా తగ్గించేశారు. ప్రస్తుతం ఆయన భార్య ప్రేమలత, బావమరిది సుధీష్‌లు పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులలో ఒకరైన విజయకాంత్ 2005లో తన సొంత రాజకీయ పార్టీని స్థాపించారు. 2006 ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసి 8.4 శాతం ఓట్లను సాధించింది. ఇది చాలా మంచి ప్రదర్శన అని అప్పట్లో చెప్పుకునేవారు.
ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. కెప్టెన్ కోలుకోవాలని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ట్వీట్‌ చేశారు. 'నా ప్రియ మిత్రుడు విజయకాంత్ త్వరగా కోలుకుని మునుపటిలా కెప్టెన్‌గా గర్జించాలని సర్వశక్తిమంతుడైన దేవుడిని ప్రార్థిస్తున్నాను' అంటూ రజనీ ట్వీట్ చేశారు.
'కెప్టెన్‌' అని అందరూ ప్రేమగా పిలుచుకునే నా ప్రియ మిత్రుడు విజీ త్వరగా కోలుకుని త్వరగా ఇంటికి తిరిగి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అని వీడియోను విడుదల చేశారు సత్యరాజ్‌. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా ప్రియ మిత్రుడు విజయకాంత్ పూర్తిగా కోలుకుని త్వరగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను అని కమల్‌హాసన్ అన్నారు.


Tags:    

Similar News