మాజీ మంత్రి ఇళ్లలో సోదాలు.. తమిళనాడులో కలకలం

మాజీ మంత్రి తంగమణి ఇళ్లు, కార్యాలయాలపై డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Update: 2021-12-15 03:55 GMT

తమిళనాడు అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి తంగమణి ఇళ్లు, కార్యాలయాలపై డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 69 చోట్ల ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. క్రిప్టో కరెన్సీలో తంగమణి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందడంతో ఈ దాడులు జరుగుతున్నాయి.

ఏపీలోనూ....
తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. తంగమణిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నై నగరంతో పాటు కోయంబత్తూరు, మధురలలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అనేక చోట్ల కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News