maha kumbha mela : ప్రయాగ్ రాజ్ కు రోజు కోటి మందికి పైగానే
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో ఘాట్ లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఎక్కడ చూసినా జనసందోహమే కనిపిస్తుంది. త్రివేణిసంగమంలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించేందుకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసింది.
ఏడు కోట్ల మంది...
ఇప్పటివరకు ఏడు కోట్ల మందికి పైగా భక్తుల పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. దాదాపు నలభై కోట్ల మంది ప్రయాగ్ రాజ్ కు వస్తారన్న అంచనాల మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసింది. పోలీసులను భారీగా మొహరించింది. అలాగే వైద్య బృందాలను కూడా నియమించింది.