మహాకుంభమేళాకు ఇప్పటి వరకూ ఎంత మంది వచ్చారంటే?
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలోతరలి వస్తున్నారు
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలోతరలి వస్తున్నారు. ఇప్పటి వరకూ 38 కోట్ల మంది గంగా నదిలో పుణ్య స్నానాలు చేసినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ వరకూ మహా కుంభమేళా జరగుతుంది. అమృత్ స్నానాలు చేసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి రావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
స్నాన్ ఘాట్ ల వద్ద...
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అందుకు తగినట్లుగా భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పుణ్యస్నానాలు జరిగే ఘాట్ ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్నాన్ ఘాట్ ల వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేసి తొక్కిసలాట జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ కోటి మందికి పైగా భక్తులు వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.