రొమ్ము క్యాన్సర్ భయం వెంటాడినా.. విజేతగా!!
72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్ ముద్దుగుమ్మ ఓపల్ సుచాత చుంగ్సీ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది.
72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్ ముద్దుగుమ్మ ఓపల్ సుచాత చుంగ్సీ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. అయితే సుచాత చిన్న వయసులో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సుచాతకు 16 ఏళ్ల వయసున్నప్పుడు రొమ్ములో కణితి ఉన్నట్లు తేలింది.
అయితే అది క్యాన్సర్ కాదని, ప్రమాదమేమీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకుంది. భవిష్యత్‌లో క్యాన్సర్‌గా రూపాంతరం చెందకుండా దానిని తొలగించినప్పటికీ, క్యాన్సర్‌తో బాధపడే వారి పరిస్థితి గురించి ఆలోచించింది. ఈ వ్యాధిపై అవగాహన పెంచాలని భావించి ఓపల్ ఫర్ హర్ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించి తొలి దశలోనే దాన్ని గుర్తించేలా చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. క్యాన్సర్ బాధితులకు అండగా ఉండేందుకు నిధుల సేకరించడంతో పాటు, కొన్ని సంస్థలతో కలిసి పని చేస్తున్నారు.