ఢిల్లీ మెట్రో రైలు రికార్డు
ఢిల్లీ మెట్రో రైలు రికార్డును క్రియేట్ చేసింది. రాఖీ పండగ రోజున అత్యధికమంది మెట్రో రైళ్లలో ప్రయాణించారు.
ఢిల్లీ మెట్రో రైలు రికార్డును క్రియేట్ చేసింది. రాఖీ పండగ రోజున అత్యధికమంది మెట్రో రైళ్లలో ప్రయాణించారు. ఒక్కరోజులోనే లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించినట్లు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ తెలిపింది. ఆగస్టు 8వ తేదీన 92 ట్రిప్పులు అదనంగా నడిపినట్లు మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఆగస్టు8వ వ తేదీన ఢిల్లీ మెట్రో రైళ్లలో 81,87,674 మంది ప్రయాణించారని పేర్కొంది.
455 అదనంగా ట్రిప్పులు...
ఆరోజున అదనంగా 92వ ట్రిప్పులను నడిపినట్లు కూడా అధికారులు తెలిపారు. రాఖీపండగ రోజున ఆగస్టు 9వ తేదీన లక్షలాది మంది మెట్రో రైళ్లలో ప్రయాణించారని, శనివారం 455 అదనంగా ట్రిప్పులను నడిపినట్లు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సర్వీసులను నడిపామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఎక్కువ మంది మెట్రో రైళ్లను ఆశ్రయించారు.