ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు హెచ్చరిక.... హైదరాబాద్ లోనూ పేలుళ్లకు కుట్ర?

జాతీయ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్ వంటి నగరంలో ఉగ్రవాద ముప్పు ఉందని నిఘా విభాగాలు హెచ్చరిక జారీ చేశాయి

Update: 2026-02-21 06:13 GMT

జాతీయ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్ వంటి నగరంలో ఉగ్రవాద ముప్పు ఉందని నిఘా విభాగాలు హెచ్చరిక జారీ చేశాయి. ఎర్రకోట పరిసరాల్లో, ముఖ్యంగా చాందినీ చౌక్ ప్రాంతంలో భద్రత పెంచారు. అక్కడి ఓ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసే అవకాశం ఉందని సమాచారం అందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.క భద్రతాబలగాలకు ఇంటలిజెన్స్ వర్గాలు చేసిన హెచ్చరికతో అప్రమత్తమయింది. అయితే హైదరాబాద్ లోనూ ఉగ్రదాడులు జరుగుతాయని హెచ్చరికలు జారీ అయింది. చంచల్ గూడ జైలులోనే ఉగ్రకుట్ర జరిగిందని అనుమానిస్తున్నారు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది ఈ కుట్ర చేసినట్లు ప్రాధమికంగా గర్తించారు. ములాఖత్ కు వచ్చిన వారు ఈ ప్రణాళికను చేసినట్లు తెలిపారు.

ముగ్గురి అరెస్ట్?
ముసారాంబాగ్, మలక్ పేట్, సైదాబాద్ ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. జైలు నుంచే నగరంలో వరస బాంబు దాడులకు పాల్పడాలని, భారీ విధ్వంసానికి పాల్పడాలని ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వరస పేలుళ్లకు కుట్ర పన్నారంటూ ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు దీనిని అధికారికంగా ధృవీకరించారు. నగరంలో విధ్వంసానికి పథక రచన చంచల్ గూడ జైలు నుంచి సాగినట్లు నిఘా వర్గాలు అనుభవిస్తున్నాయి. లష్కరే తోయిబా సంస్థకు కు చెందిన ఉగ్రవాది జైలు నుంచి ఈ కుట్ర చేశాడని పోలీసులు అనుమానించారు. దీంతో హైదరాబాద్ లోనూ పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు.
చాందినీ చౌక్ వద్ద...
నిఘా సమాచారం ప్రకారం పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దేశంలోని కీలక ఆధ్యాత్మిక క్షేత్రాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట పరిసరాలు, చాంద్నీ చౌక్‌లోని కొన్ని ప్రాంతాలు వారి లక్ష్య జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఐఈడీతో దాడి చేసే ప్రణాళిక సాగుతోందని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఫిబ్రవరి 6వేతేదీన పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ నగరంలో మసీదు వద్ద జరిగిన పేలుడుకు ప్రతీకారంగా భారత్‌లో పెద్ద దాడి చేయాలని ఆ సంస్థ యత్నిస్తోందని తెలిపారు. దేశంలోని ప్రధాన దేవాలయాలు కూడా లక్ష్యంగా మారే అవకాశముందని హెచ్చరించారు.“దిల్లీలో ఎర్రకోట ముందు పేలుడు హెచ్చరిక ఉంది. చాంద్ నీ చౌక్‌లోని దేవాలయాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చు. ఐఈడీతో దాడి చేసే యత్నం సాగుతోంది. ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్‌లో మసీదు వద్ద జరిగిన పేలుడుకు ప్రతీకారంగా భారత్‌లో పెద్ద దాడి చేయాలని యోచిస్తున్నారు. దేశంలోని ప్రధాన దేవాలయాలు కూడా లక్ష్యంగా మారవచ్చు” అని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఆధ్యాత్మిక కేంద్రాల లక్ష్యంగా...
దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక స్థలాలు కూడా వారి గమనికలో ఉన్నాయని అధికారులు తెలిపారు.గత సంవత్సరం నవంబర్‌ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎర్రకోట సమీపంలోని మెట్రో గేట్ నంబర్‌–1 వద్ద పేలుడు పదార్థాలతో నింపిన కారు పేలడంతో సమీప వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. ఫిబ్రవరి 13న జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం పాటియాలా హౌస్ కోర్టులో విచారణ గడువును మరో 45 రోజులు పొడిగించింది. దర్యాప్తు పూర్తిచేసేందుకు 90 రోజుల గడువు కోరినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. ఈ కేసులో ఏడుగురు నిందితుల జ్యుడిషియల్ కస్టడీని మార్చి 13 వరకు పొడిగించారు. దీంతో ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు నాకా బందీ నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News