ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఐదు గంటలు క్లోజ్

తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఐదు గంటలు మూసివేశారు

Update: 2026-04-09 12:10 GMT

తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం గంటల పాటు విమానాల రాకపోకలను నిలిపివేసింది. ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయ వార్షిక 'పైంగుని ఆరాట్టు' ఉత్సవంలో భాగంగా స్వామివారి విగ్రహాలను శంఖుముఖం తీరంలో పవిత్ర స్నానానికి తీసుకెళ్లేందుకు రన్‌వేను ఉపయోగించడం ఇక్కడి ప్రత్యేకత.

దేవుడి ఊరేగింపు కోసం...
అందుకోసం దేవుడి ఊరేగింపు కోసం రన్ వే ను ఐదు గంటల పాటు క్లోజ్ చేశారు. 1932 నుంచి, అంటే విమానాశ్రయం ఏర్పాటుకు ముందు నుంచే ఈ మార్గం ఉన్నందున, ఏటా రెండుసార్లు ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేస్తుంటారు.


Tags:    

Similar News