భార్యా బాధితుడికి ఆ హైకోర్టు అండ

భార్య వేధిస్తుంటే ఎంతగానో ఇబ్బందులు పడుతున్న భర్తకు ఢిల్లీ హైకోర్టు అండగా

Update: 2023-09-16 05:46 GMT

భార్య వేధిస్తుంటే ఎంతగానో ఇబ్బందులు పడుతున్న భర్తకు ఢిల్లీ హైకోర్టు అండగా నిలిచింది. సదరు జంట 2005లోనే వేరుపడింది. అయితే భార్య పదే పదే పలు కేసులు పెడుతూ ఉండడంతో భర్త డీలా పడిపోయాడు. ఇంతలో ఓ కుటుంబ కోర్టు వీరికి విడాకులు మంజూరుచేసింది. అయితే భార్య ఆ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. తన భర్త వేరే మహిళను వివాహం చేసుకున్నాడని, తాను అతడిని వేధిస్తున్నానడం నిజం కాదని విడాకులు రద్దు చేయాలని కోరింది. ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది ఢిల్లీ హైకోర్టు. తీర్పులో వేధిస్తున్న భార్యపై కీలక వ్యాఖ్యలు చేసింది. దీర్ఘకాలంపాటు దంపతులు వేరుగా ఉండి, విడాకుల వ్యవహారం కోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు భర్త మరొక మహిళతో కలిసి ఉన్నందున విడాకులు రద్దు చేయాలన్న భార్య వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.

భర్త పట్ల, అత్తింటివారి పట్ల ఆమె అగౌరవంగా ప్రవర్తించిందనీ, తరచూ క్రిమినల్‌ ఆరోపణలు చేస్తూ భర్తకు ప్రశాంతత లేకుండా చేసిందని కోర్టు అభిప్రాయపడింది. అది విడాకుల పిటిషను దాఖలు చేసిన తరవాత జరిగిన పరిణామం కాబట్టి, విడాకులను రద్దు చేయాల్సిన పని లేదని కోర్టు తెలిపింది. భార్య క్రూర ప్రవర్తన కారణంగా అతడికి కుటుంబ కోర్టు విడాకులు మంజూరుచేయడం సరైన పనే అని సమర్థించింది.


Tags:    

Similar News