Kejrival : కేజ్రీవాల్ కూడా బెయిల్ కోసం సుప్రీంకు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు
arvind kejriwal, chief minister, bail, supreme court
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. ఇటీవల హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరయింది.
సీబీఐ కేసులో...
అయితే సీబీఐ దాఖలు చేసిన కేసులో మాత్రం ఆయనకు బెయిల్ రాకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉంటున్నారు. ఆయన తనకు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఇదే కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ రావడంతో వీరికి కూడా బెయిల్ వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.