పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
పసిడి కొనుగోలుదారులకు ఇది నిజంగా శుభవార్తే. 10 గ్రాముల బంగారంపై ..
dec 24th gold and silver prices
గతకొద్ది రోజులుగా.. పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. పసిడి కొనుగోలుదారులకు ఇది నిజంగా శుభవార్తే. 10 గ్రాముల బంగారంపై రూ.550 నుండి రూ.600 వరకూ బంగారం ధర తగ్గింది. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,220 పలుకుతోంది.
విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,220 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,270గా ఉంది. వెండి విషయానికొస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.73,700గా ఉంది.