Helicopter Crash : వరస ప్రమాదాలకు కారణాలేంటి? అలెర్ట్ అయిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

ఉత్తరాఖండ్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది.

Update: 2025-06-15 05:57 GMT

ఉత్తరాఖండ్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్ లో ఈ ప్రమాదం జరిగింది. వాతావరణం సహకరించకపోవడం, ఉదయం 5.30 గంటల సమయంలో హెలికాప్టర్ బయలుదేరడంతో మంచుకురుస్తుండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఉత్తరాంఖండ్ లో వరస హెలికాప్టర్ ప్రమాదాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకూ ముప్ఫయి మంది మరణించారు. కేదార్ నాథ్ ఆలయం తెరుచుకున్న తర్వాత ఇప్పటి వరకూ ఐదు హెలికాప్టర్లు ప్రమాదానికి గురయ్యాయి.

సీరియస్ అయిన సీఎం...
ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్ నాధ్ కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. వరస హెలికాప్టర్ ప్రమాదాలకు గల కారణాలపై విచారణ జరపాలని డిమాండడ్ వినిపిస్తుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా ఈ వరస ప్రమాదాలపై సీరియస్ అయ్యారు. హెలికాప్టర్ నిర్వహణలో లోపాలు ఉన్నాయా? లేక వాతావరణం అనుకూలించకే ఇటువంటి ఘటనలు జరుగుతన్నాయా? అన్నది విచారణలో తేల్చాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాఖండ్ లో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుంటాయి. పైలట్ తో సహా ఏడుగురు మరణించారు.
ప్రతి ఐదు నిమిషాలకు...
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా హెలికాప్టర్లను నడపాలని కూడా ఆదేశాలు అందాయి. కేదార్ నాథ్ కు ప్రతి ఐదు నిమిషాలకు ఒక హెలికాప్టర్ వెళుతుంటుంది. కేదార్ నాధ్ ను దర్శించుకునే యాత్రికుల కోసం ఈ హెలికాప్టర్లను వినియోగిస్తారు. దీంతో చార్ ధామ్ యాత్రకు హెలికాప్టర్ ఫ్రీక్వెన్సీని తగ్గించాలని నిర్ణయించారు. మే 2వ తేదీన కేదార్ నాధ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.అప్పటి నుంచి వరస ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలకు ఇక చెక్ పెట్టాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావిస్తుంది. హెలికాప్టర్ ల పనితీరును పరిశీలించిన తర్వాత మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకునే అవకాశముంది.


Tags:    

Similar News