పదకొండు మంది సజీవ సమాధి

ఢిల్లీలో భవనం కుప్ప కూలిన ఘటనలో మృతుల సంఖ్య పదకొండుకు చేరుకుంది

Update: 2025-04-20 04:21 GMT

ఢిల్లీలో భవనం కుప్ప కూలిన ఘటనలో మృతుల సంఖ్య పదకొండుకు చేరుకుంది. ఢిల్లీలో నిన్న నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో తొలుత నలుగురు మరణించారని భఆవిచంారు. అయితే ఈ మృతుల సంఖ్య పదకొండుకు చేరుకుంది. ముస్తఫాబాద్ లోని శక్తివిహార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్లుండి భవనం కుప్పకూలడంతో పదకొండు మంది సజీవ సమాధి అయ్యారు.

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు...
భవనం కుప్ప కూలిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ తో పాటు అగ్నిమాపక కసిబ్బంది, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాలను తొలగించారు. అయితే ఈ ప్రమాదంలో భవన యజమానితో పాటు ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందారని, వారంతా భవన యజమాని కుటుంబ సభ్యులేనని పోలీసులు చెబుున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురుచిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన మరో పదకొండు మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


Tags:    

Similar News