Plane Crash : విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగనుందా? తప్పిపోయిన వారి గురించి ఫిర్యాదులు
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరసగా తమ వారు కన్పించడం లేదంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా సినీ నిర్మాత భార్య ఒకరు తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త మహేశ్ కలవాడియా కనిపించడం లేదంటూ హేతల్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సినీ నిర్మాత ఒకరు...
లా గార్డెన్ ప్రాంతంలో ఒకరిని కలవడానికి వెళ్లి అదృశ్యమయ్యారని హేతల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యాహ్నం 1.14 గంటలకు తనకు ఫోన్ చేసి సమావేశం ముగిసిందని, ఇంటికి వెళ్తున్నట్లుగా చెప్పాడని, తర్వాత ఇంటికి ఎంతకీ తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమెతెలిపారు. డీఎన్ఏ నమూనాలు కుటుంబసభ్యులు సమర్పించారు. అయితే సినీనిర్మాత మహేశ్ కలవాడియా చివరిగా ఎయిరిండియా విమాన ప్రమాదం నుంచి 700 మీటర్ల దూరంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.