ముంచుకొస్తున్న తుపాను.. 8 రాష్ట్రాలకు అలర్ట్

తీరప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లడంలేదు. భారీ సంఖ్యలో పడవలన్నీ..

Update: 2023-06-14 11:33 GMT

biporjoy cyclone update

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపార్ జోయ్ అనే తుపాను తీరం వైపుకు దూసుకొస్తోంది. గురువారం సాయంత్రం ఈ తుపాను గుజరాత్ లోని జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటనున్నట్లు ఐఎండీ తెలిపింది. తీరం దాటే సమయంలో భారీ నష్టం తప్పదని ఇప్పటికే హెచ్చరించింది. కచ్, ద్వారక, సౌరాష్ట్ర, జామ్ నగర్ లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భుజ్ విమానాశ్రయాన్ని 16 వరకూ మూసివేశారు. ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని ఏడు జిల్లాల నుండి మొత్తం 47,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మాండ్విలోని స్వామినారాయణ టెంపుల్ లో దాదాపు 5000 ఫుడ్ ప్యాకెట్స్ ను అవసరమైన సమయంలో ఇచ్చేందుకు సిద్ధం చేశారు.

తీరప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లడంలేదు. భారీ సంఖ్యలో పడవలన్నీ కచ్ తీరంలోనే ఆగిపోయాయి. కచ్, ద్వారక, పోర్ బందర్, జామ్ నగర్, మోర్బీ, జునాగఢ్, రాజ్ కోట్ జిల్లాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరద ముప్పు పొంచి ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఐఎండీ హెచ్చరించింది. 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ కు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
గుజరాత్ తో పాటు ఎనిమిది రాష్ట్రాలపై తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతో పాటు డామన్ డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. జోధ్ పుర్, ఉదయ్ పుర్ జిల్లాలోనూ భారీవర్షపాతం నమోదు కావొచ్చని హెచ్చరించింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ం కూడా తుపాను ప్రభావం, చేపట్టవలసిన చర్యలపై సమీక్షలు నిర్వహించనుంది.


Tags:    

Similar News