కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో భక్తులు రద్దీ కొనసాగుతుంది.
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. రోజుకు కోటి మందికి పైగానే వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇక మహా కుంభమేళా ముగియడానికి తేదీ దగ్గరపడుతుండటంతో రద్దీ మరింత పెరిగే అవకాశముందని అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకుంటుున్నారు.
ఇంకా నాలుగు రోజులే...
మరో నాలుగు రోజుల్లో కుంభమేళా ముగియనుంది. ఈ నెల 26వ తేదీతో ముగియనుండటంతో భక్తులు ప్రయాగ్ రాజ్ కు పోటెత్తే అవకాశముంది. అన్ని ఘాట్ లవద్ద భద్రతను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మరింత పెంచింది. ఈ నెల 26వ తేదీన శివరాత్రి కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశముందని భావించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.