ఎందుకు ఈ నగరాల్లోనే కరోనా...?

దేశంలో ప్రధానంగా మూడు నగరాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది

Update: 2022-01-14 02:26 GMT

దేశంలో ప్రధానంగా మూడు నగరాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. కరోనా కట్టడి కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని ఆంక్షలు విధించినా ఫలితం కన్పించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబయి, బెంగళూరులోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కూడా ఈ నగరాలే ఎక్కువగా కరోనా బారిన పడ్డాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా ఆ నగరాలనే తాకింది.

ఆ మూడు నగరాలు.....
ఇక ఢిల్లీలో రోజుకు పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 28,867 మంది మృతి చెందారు. కరోనా కారణంగా 31 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో 94,160 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కర్ణాటకలో కూడా ఈ వేవ్ ఊపేస్తుంది. ఒక్కరోజులోనే 25,005 కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. యాక్టివ్ కేసులు 1,15,733 ఉన్నాయి. మహారాష్ట్ర ఇటు కరోనా, అటు ఒమిక్రాన్ కేసుల్లోనూ టాప్ లో ఉంది. అందులో ముంబయి నగరంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.


Tags:    

Similar News